రాష్ట్రంలో జీతాలు కుదింపు చేస్తే ఎద్దేవా చేశారు కదా మరి  కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేసింది దీనికి ఏమంటారు. 

  • రాష్ట్రంలో జీతాలు కుదింపు చేస్తే ఎద్దేవా చేశారు కదా మరి  కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేసింది దీనికి ఏమంటారు. 
  • అవకాశవాద రాజకీయాలు చేసే బిజెపి నేతలు నిజంగా కుహనా మేధావులు. 
  • దేశానికి పట్టిన దరిద్రం తెలంగాణ బీజేపీ నేతల ఇరుకైన మనస్తత్వం. 
తాను చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న లెవల్లో ఉంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతల మాటలు, వాళ్ళ వికృతచేష్టలు.ఎల్లప్పుడూ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకునే తెలంగాణ ప్రభుత్వం అత్యవసర ఖర్చుల నిమిత్తం తెలంగాణ ఉద్యోగుల జీతాలు కాస్త కుదింపు చేస్తే కుక్కల్లా మొరిగిన ఈ కుహనా మేధావులు. అదే పని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తే మాత్రం మాట్లాడడానికి నోరు మెదపడం లేదు. నిజానికి ఇది విమర్శించుకొనే సమయం కానీ, రాజకీయాలు చేసే సమయం కాని కాదని గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలను కూడా ఏమీ అనవద్దని స్వయంగా ప్రధానమంత్రి ని ఎవరైనా ఏమైనా అంటే బొక్కలో తోస్తానని చెప్పడం జరిగింది.
కానీ కేవలం అవకాశవాద రాజకీయాలని నమ్ముకున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ లాంటి నేతల ముఖ్యమంత్రి గారిని ఉద్యోగుల జీతాల విషయంలో రాజకీయం చేసి తమ వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు.అయినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఎప్పుడూ కూడా వీళ్ళ విమర్శలను పట్టించుకోలేదు.దేశమే కష్ట సమయంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర తో సహా మిగతా రాష్ట్రాల్లో జీతాల్లో కుదింపు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇదే చర్యను కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా అవసరమని పేర్కొంది. మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు ఎందుకు నోరు తెరడం లేదు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా కొంచెం సిగ్గు లజ్జా తెచ్చుకుని ప్రజలకు మంచి చేసే విషయంలో రాజకీయాలు చేయకూడదు అని గుర్తిస్తే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *