సంతన్నా..నీ పోస్టుతో  గుండెలను కదిలించావ్​! నీలాంటి నాయకులే ఇప్పుడు సమాజానికి కావాల్సింది!

  • సంతన్నా..నీ పోస్టుతో  గుండెలను కదిలించావ్​!
  • నీలాంటి నాయకులే ఇప్పుడు సమాజానికి కావాల్సింది!
  • నీలాంటి వాళ్లు పేదలకు పెద్ద దిక్కు!

ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్ ట్విటర్​ పోస్టులు మనల్ని కదిలిస్తాయి. మనలోని మనిషిని నిద్రలేపుతాయి. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే సందేశం ఇస్తాయి. సాటి మనిషి కోసం ఆయన పడే ఆరాటం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. పీడితులు, తాడితులు, విధివంచితులు, అనాథలు, నిరాశ్రయుల కోసం ఆయన పడే తపన చూస్తే.. లీడర్​ అంటే ఇలా ఉండాలి! అనిపించకమానదు.

నార్కట్​పల్లి దగ్గర కొందరు నిరాశ్రయులు పడుతున్న బాధల గురించి ఒక పత్రికలో వచ్చిన వార్త క్లిపింగ్​ను ఆయన ట్విటర్​లో పోస్ట్​ చేశారు. అది చదివిన వారి గుండెలు బరువెక్కడం ఖాయం. ఆ పోస్టులో ఆయన ఇలా రాశారు. ‘‘హృదయం ద్రవిస్తోంది! నార్కట్​పల్లిలోని సంచార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాల గురించిన వార్త నన్ను కదిలించింది. వారి బాగోగులు చూసుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేలను నేను రిక్వెస్ట్​ చేస్తున్నాను. మన తెలంగాణలో ఎవరూ ఆకలితో ఉండొద్దని సీఎం కేసీఆర్​ స్పష్టంగా చెప్పారు” అని పేర్కొన్నారు.

లాక్​డౌన్​లో సుఖంగా గడుపుతున్న మనం దిక్కు లేని వారి పట్టించుకుంటాన్నామా ? వారి మంచిచెడులను పట్టించుకుంటున్నామా ? కేసీఆర్​ ప్రభుత్వం యంత్రంలా 24 గంటలూ పనిచేస్తోంది. దానికి మనం తగిన సహకారం ఇస్తున్నామా ? ఇవన్నీ ఇప్పుడు మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్నలు. నిజంగా సంతోష్​ కుమార్​ వంటి ఎంపీ ఉండటం తెరాసకు పెద్ద ఆస్తి అని చెప్పాలి. ఆయన పేదలకే కాదు ప్రకృతిని రక్షించడానికి తన శక్తిని అంతా ధారపోస్తున్నారు. రాజకీయాల్లో నానాటికీ  స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నాయకులు ఉండటం నిజంగా గొప్ప విషయం. సంతోష్​ వంటి నాయకుల వల్ల రాజకీయాలపై గౌరవం మరింత పెరుగుతుంది.

రాజకీయ నాయకుల్లోనూ సున్నిత మనస్కులు ఉంటారని, ప్రతి సమస్యనూ తన సొంత సమస్యలా భావించి పరిష్కరించే వాళ్లూ ఉంటారనడానికి సంతోషన్న గొప్ప ఉదాహరణ! అన్నా.. నీ మంచితనం, మానవత్వం, ప్రకృతిని ప్రేమించి గుణంతో నువ్వు ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలుస్తావు.