- బుర్ర తక్కువ నోరు ఎక్కువ
- కరోనాపై బండి సంజయ్ దుష్ప్రచారం
- ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడం అసాధ్యం
- ఇలా చేస్తే కార్పొరేట్ ఆస్పత్రులకే లాభం
ఇండియాలో కరోనా కేసులు అత్యంత తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మొదటి నుంచీ మన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండబట్టే కేసులు చాలా తక్కువ నమోదవుతున్నాయి. లాక్డౌన్ రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు. టెస్టులను మరింత పెంచారు. ఇంత చేస్తున్నా బీజేపీ వాళ్లు ప్రభుత్వంపై విమర్శలను ఆపడం లేదు.
అసలు రాష్ట్రంలో కరోనాకు ట్రీట్మెంటే లేదన్నట్టు బండి సంజయ్ మాట్లాడుతున్నడు. కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్‌తో కోఠీలోని కరోనా కమాండ్ సెంటర్ వద్ద లొల్లికి దిగి అరెస్టు అయ్యాడు. ఇది నూటికి నూరుశాతం పబ్లిసిటీ స్టంట్. మీడియాలో ఫొటోల కోసమే బీజేపీ బ్యాచ్ హంగామా చేసింది. కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలనే ప్రపోజల్ సాధ్యం కాదనే విషయం తెలిసి కూడా సంజయ్ బ్యాచ్ హల్చల్ చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే కార్పొరేట్ల దోపిడీ దారుణంగా ఉంటుంది. ప్రతి పేషేంటుకూ కరోనా వచ్చిందని పేర్కొంటూ కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి గుంజుతాయి. కరోనా లేని వారికీ ఆ రోగం ఉందని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తాయి. దీనివల్ల ప్రభుత్వంతోపాటు ప్రజలకూ నష్టం తప్పదు. దీనికిబదులు గాంధీలోనే సౌకర్యాలను మెరుగుపర్చుకుంటే, మరింత పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయొచ్చు.సంజయ్‌కు ఇవన్నీ తెలియవా.. అంటే తెలియవని కాదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఈయన టార్గెట్. కేంద్రం నుంచి రాష్ట్రానికి నయాపైసా రావడం లేదు. ఈ విషయంపై మాత్రం ఈ గుండోడు నోరు మెదపడు. ఈయనకు జనం బాగోగులు అవసరం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మాత్రమే కావాలి.