కమలానికి బీటలు.. రుజూవు చేస్తున్నాయి గవర్నర్ మాటలు

కమలానికి బీటలు.. రుజూవు చేస్తున్నాయి గవర్నర్ మాటలు

  • వాస్తవాలు వివరించేలా గవర్నర్ తమిళి సై గణతంత్ర ప్రసంగం
  • సంక్షేమ పథకాలు, అమలు, లక్ష్యాలు వివరించిన గవర్నర్
  • ఎర్రి పుష్పాలు వాస్తవాలు తెలుసుకోవాలంటున్న జనం

“తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. పల్లె ప్రగతితో ఊళ్ల రూపురేఖలు మారిపోయాయి. మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ చట్టాలు తెచ్చాం. హరిత తెలంగాణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతోంది” అంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. పథకాలతో ప్రజలకు చేరువ అవుతున్నామన్నారు.

ఈ లెక్కన టీఆర్ఎస్ ప్రభుత్వం.. చేస్తున్న సంక్షేమానికి ప్రజలు సంతోషంగా ఉంటున్నరు అంటె.. ఇతరపార్టీలు బీటలు వారుతున్నట్టె లెక్క అని అర్థం. ఆ ఇతర పార్టీల్లో.. మన గవర్నర్ తమిళిసై గతంలో ప్రాతినిధ్యం వహించిన బీజేపీ కూడా ఉన్నట్టే. మరి ఈ వాస్తవాన్ని బీజేపీ నేతలు ఏమైనా గ్రహించారా? ఓనాటి సహచరి చెప్పిన మాటలు పట్టించుకున్నారా? జనాల్లో పార్టీ ఎదగని తీరును ఏమైనా గమనించారా?

ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలనుంచి కానీ.. బీజేపీ నేతల నుంచి కానీ.. నో అని మాత్రమే సమాధానం వస్తోంది. మరి ఆ మాత్రం దానికి ఈ వెర్రి పుష్పాలు.. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇంతగా ఎందుకు నోరు పారేసుకుంటున్నట్టు.. అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. అనవసరంగా తప్పుడు ఆరోపణలు ఎందుకు అని నిలదీస్తున్నది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కాబట్టే.. నిన్న కాంగ్రెస్ చతికిలపడ్డది. ఇవాళ బీజేపీకి అదే పరిస్థితి ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా ఈ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి.

ఈ వాస్తవాన్ని బీజేపీ నేతలు అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ.. పాతాళానికి దిగజారుతున్న తమ పార్టీని మంచి మాటలతో వాళ్లు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని.. మేం కాదు. జనం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.