ఎస్సీని నిలబెట్టినా ఎస్టీని నిలబెట్టినా ఏం లాభం ? బీజేపీని జనం నమ్మడం లేదు

ఎస్సీని నిలబెట్టినా ఎస్టీని నిలబెట్టినా ఏం లాభం ?

బీజేపీని జనం నమ్మడం లేదు

సాగర్​లో కమలం వాడిపోవడం ఖాయం

నాగార్జున సాగర్​లో గిరిజనుడు రవి నాయక్​ను పోటీలో పెట్టాం కాబట్టి గెలుపు మాదేనని బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్​ డబ్బా కొట్టుకుంటున్నడు. టీఆర్​ఎస్​ను చిత్తుగా ఓడిస్తామని కోతలు కోస్తున్నడు. రవి గిరిజనుల కోసం ఎన్నో పోరాటాలు చేశాడట.  కొమ్రం భీమ్​కు సమానం అనే రేంజ్​లో మాట్లాడుతున్నడు. రవి ఎప్పుడు ఎవరి కోసం పోరాడాడో ఈ ప్రపంచంలో ఆయనకు, సంజయ్​కు తప్ప ఎవరికీ తెలియదు. ఎన్నేళ్లు, ఎక్కడ జైల్లో ఉన్నడో కూడా ఎవ్వరికీ తెలియదు. కొంపదీసి నక్సలైట్లలో ఏమైనా పనిచేశాడో తెలియదు. ఈ మనిషి ఒక డాక్టర్. అందరిలాగానే క్లినిక్​ పెట్టి డబ్బులు కమాయించే మనిషి. ప్రజా సేవంటే తెలియదు. ఇతడు ఎస్సీ అయితే ఏం ఫాయిదా ? ఎస్సీ అయితే ఏం లాభం ?

అసలు జనానికి ఏం లాభం ? కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అరాచకాలు తెలిసిన వాళ్లు ఎవడైనా కమలానికి ఓటేస్తారా ? ఏకంగా పొయ్యిలో తలపెడతారా ? అన్ని వస్తువుల రేట్లు పెంచుతున్నరు. గవర్నమెంటు సంస్థలను అంబానీలకు, అదానీలకు అమ్ముతున్నరు. తెలంగాణ నుంచి వసూలు చేయడం తప్ప ఒక్క పైసా సాయం పంపడం లేదు. తెలంగాణ హక్కుగా రావాల్సిన డబ్బు కూడా పంపడం లేదు. బీజేపీ మనకు చేస్తున్న అన్యాయాన్ని తల్చుకుంటే కడుపు రగులుతుంది. అందుకే ఎమెల్సీ ఎన్నికల్లో పువ్వుపార్టీ లీడర్లను జనం చిత్తుగా ఓడించారు. రవి పరిస్థితి కూడా అంతే. డిపాజిట్ కూడా దక్కడం కష్టమేనని సర్వేలన్నీ చెబుతున్నాయి. భగత్ గెలుపు వందశాతం గ్యారంటీ.

2014లో టీఆర్‌ఎస్‌లో చేరిన భగత్ 2014-18 ఎన్నికల సమయంలో ఆ స్థానంలో పోటీ చేసిన తన తండ్రి నర్సింహయ్యకు ఆర్గనైజర్ గా, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహకుడిగా పార్టీకి సేవలందించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం భగత్ చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు. ఇంజినీరింగ్‌ చదివి.. ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తూనే ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. 2010-2012 సమయంలో సత్యం కంపెనీలో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేశారు. విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్ గా కూడా సేవలందించారు. 2014-2018 వరకు హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేశారు. న్యాయవాదిగా ఎంతోమంది సామాన్యులకు న్యాయసేవ చేస్తున్నారు. భగత్​తో రవిని అస్సలు పోల్చలేం. ఇద్దరికీ జమీన్​ ఆస్మాన్ ఫరఖ్​ ఉంది. దుబ్బాకలో మతరాజకీయం చేసిన బీజేపీ ఇక్కడ కులరాజకీయం మొదలుపెట్టింది.