ఏంటి లక్ష్మణ్.. జోకులు బాగా పేల్చుతున్నావు

  • ఏంటి లక్ష్మణ్.. జోకులు బాగా పేల్చుతున్నావు
  • మీరు గెలిచే చోటు కూడా ఉందా?
  • కొన్ని స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి మీది
  • దొంగ ఓట్లు అని నీనోటి నుంచి వచ్చిందంటే ఆ పని చేసిందే మీరు అన్నమాట

దొంగ ఓట్లు.. దొంగ ఓట్లు అంటూ బీజేపీ లక్ష్మణ్.. ఒక మంత్రంలా జపిస్తున్నాడు. మిస్టర్ లక్ష్మణ్.. మీరే దొంగ ఓట్లు వేయించి ఉంటారు. అందుకే.. వాటి గురించి బాగా జపిస్తున్నారు. అయినా.. దొంగ ఓట్లు వేయించాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి అస్సలు లేదు. తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. మీరు వద్దన్నా కూడా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారు. అది చూసి తట్టుకోలేకనే ఇలా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీపై మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.

నువ్వు ఒక విషయం మరిచిపోతున్నావు లక్ష్మణ్. అసలు.. తెలంగాణలో బీజేపీ అనే పార్టీ ఉందా? ఉంటే.. 2014 నుంచి జరిగిన ఎన్నికల్లో మీరు గెలిచిన ఎన్నికలు ఒకటి చెప్పు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అసలు వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు మీ పార్టీకి. అది మీకు షేమ్ అనిపించడం లేదా? తెలంగాణ ప్రజలు వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో మిమ్మల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంటే.. మీరు మాత్రం ఇంకా టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లుతూ కాలక్షేపం చేస్తున్నారు. అయినా మీరు అంతకు మించి ఇంకేం చేయలేరులే. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పార్టీ భూస్థాపితం అయిపోయింది కదా.

అసలు.. మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ సీటు అయినా గెలిచే సీన్ ఉందా? నిలబడటానికి అభ్యర్థులే దొరకలేదు. ఇప్పుడు పెద్ద శుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. కాస్త పరిణతితో ఆలోచించండి లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది గతంలో లేదు.. ప్రస్తుతంలో లేదు. భవిష్యత్తులోనూ ఉండదు. బీజేపీకి తెలంగాణలో నూకలు లేవు. అది గుర్తు పెట్టుకోండి. తెలంగాణ ప్రజలు ఛీ.. ఛీ.. అని బీజేపీ ఛీత్కరించినా ఇంకా మీరు తెలంగాణను పట్టుకొని వేలాడుతున్నారు. తెలంగాణను అభవృద్ధి చేస్తున్న అధికార పార్టీపై బురద జల్లుతున్నారు. దాని వల్ల మీకు ఏం రాదు లక్ష్మణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *