ఇదీ కేసీఆర్ మంచితనం.. చాటుకున్నారు హుందాతనం

ఇదీ కేసీఆర్ మంచితనం.. చాటుకున్నారు హుందాతనం

  • ప్రధాని మోదీని అవహేళన చేసిన వారిపై ఆగ్రహం
  • కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఎం
  • శభాష్ కేసీఆర్ అంటున్న తెలంగాణ ప్రజానీకం

చెడుతో యుద్ధం చేయడంలో.. మంచితో స్నేహం చేయడంలో ముందుండే ప్రజా నాయకులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. అది సొంత పార్టీ వారైనా.. పరాయి పార్టీ వారైనా సరే. మంచికి మంచి.. చెడుకు చెడు.. అని కేసీఆర్ తన చర్యలతో చాలాసార్లు నిరూపించారు. తాజాగా.. జనతా కర్ఫ్యూకు ప్రధాని మోదీ పిలుపునిస్తే.. కొందరు చిల్లరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో హేళన చేస్తున్నారు. పనికి మాలిన కామెంట్లు పెడుతున్నారు. అలాంటి వారి చమ్డాలు ఒలుస్తమని కేసీఆర్.. స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొంటుంటే.. అండగా నిలవాల్సింది పోయి చిల్లర కూతలు కూస్తున్న వారిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. తగిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని.. ముఖ్యమంత్రిగా ఆదేశించారు. ప్రధాని చెప్పినట్టు అంతా బయటికి వచ్చి.. దేశానికి సంఘీభావంగా.. కరోనాపై ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర అన్ని వర్గాలకు మద్దతుగా చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు చేయడం మాత్రమే కాదు.. తాను కూడా ఇంటి బయటికి వచ్చి ఆ పని చేసి తీరుతానని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ దేశంలో.. రాజకీయ నాయకుల్లో ఇంతగా మంచిని స్వాగతించిన నాయకుడిని మనం ఇప్పటివరకూ చూడలేదు. అంతెందుకు.. దేశం యావత్తు ఇంతగా ఆందోళనతో ఉంటే.. మోదీ, కేసీఆర్ సహా చాలా మంది నాయకులు జనాన్ని జాగృతం చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఎవరైనా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారా? ఒక్కరంటే ఒక్కరైనా ఈ దిశగా నాలుగు మంచి ముక్కలు చెప్పిన నాయకుడు మనకు కనిపించాడా? లేరు. నాయకులు కాదు కదా.. కార్యకర్తలు కూడా లేరు. అందుకే.. మంచికి మంచి అని ముందుకు వచ్చిన కేసీఆర్ ను ప్రజలే కాదు.. బీజేపీ నాయకులు కూడా అభినందిస్తున్నారు.

కేసీఆర్ బాటలో ఇతర పార్టీల నాయకులు, ప్రజలు నడిస్తే.. కరోనా లాంటి విపత్తును జయించవచ్చని.. అప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

2 thoughts on “ఇదీ కేసీఆర్ మంచితనం.. చాటుకున్నారు హుందాతనం

Leave a Reply

Your email address will not be published.