కరోన గురించి అడ్డగోలు రాతలు రాయకండి

 

  • మనం చేస్తున్నవి ర్యాపిడ్​ టెస్టులు కావు
  • తక్షణం ఫలితాలు రావు
  • అలాంటి కిట్లతో టెస్టులు చేయడం దండగ

కరోనా టెస్టులు చేయించుకున్నవాళ్లకు రిజల్టును త్వరగా చెప్పడం లేదని, దీనివల్ల వాళ్లు ఎంతో నష్టపోతున్నారని వెలుగు పత్రిక కనుగొంది!!  తమకు వైరస్ ఉందో, లేదో తెలుసుకోవడానికి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారని ఒక ‘పరిశోధనాత్మక’ కత రాసింది.  టెస్ట్ శాంపిల్ తీసుకునేటప్పుడు సెల్ నంబర్ నుంచి ఇంటి నంబర్ వరకూ అన్నీ తీసుకుంటున్న ఆఫీసర్లు.. టెస్ట్ ఫలితం మాత్రం బాధితులకు చెప్పడం లేదని నిందించింది.

అసలు విషయం ఏమిటంటే.. ఈ వార్త రాసిన మహాశయుడు ఉద్దేశపూర్వకంగానే కొన్ని విషయాలను దాచిపెట్టాడు. అవేంటంటే.. ఏపీ ప్రభుత్వం ఉపయోగించే ర్యాపిడ్​ కిట్లు వాడితే ఫలితాలు తొందరగా వస్తాయి. ఆ విషయాన్ని పేషేంట్లకు ఫోన్ ద్వారానో మెసేజ్​ ద్వారానో చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ర్యాపిడ్ కిట్లను వాడటం లేదు. వాటి ద్వారా వచ్చిన ఫలితాలను నమ్మకూడదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే వాటిని పక్కనబెట్టారు. లేట్​ అయినా సరే రిజల్ట్​ పక్కాగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన.

ర్యాపిడ్​ కిట్​తో కచ్చితమైన ఫలితం రాదని తెలిసినప్పుడు దానిని వాడటం వృథా! సాధారణ పద్ధతిలో టెస్టులు చేయడం, టెస్టుల సంఖ్య విపరీతంగా పెంచడం వల్ల కొంత ఆలస్యం అనిపిస్తోంది. ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే టెస్టుల రిజల్టుతో సంబంధం లేకుండా తక్షణమే ట్రీట్​మెంట్​ ఇస్తున్నారు. రిజల్టు వచ్చే దాకా ఆగడం లేదు. మరీ అర్జంటుగా కావాలనుకుంటే ప్రైవేటు ల్యాబులోనూ చేయించుకోవచ్చు. టెస్టులు పూర్తయిన మరుక్షణమే రిజల్టును తెలియజేస్తున్నారు. టెస్టుల రికార్డులను దాచి పెట్టుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదని వెలుగు పత్రిక గుర్తుంచుకోవాలి. ఇలాంటి చెత్త రాతల వల్ల పత్రిక విలువ మరింత పడిపోతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. బీజేపీ భజన చేస్తే ప్రజల్లో ఇంకా చులకన అవుతామనే విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి.