రైతులు ఎక్క‌డ ఇబ్బందులు ప‌డుతున్న‌రో చూపిస్త‌వా సంజ‌య్ ?క‌రోనా కాలంలోనూ రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా ?

  • రైతులు ఎక్క‌డ ఇబ్బందులు ప‌డుతున్న‌రో చూపిస్త‌వా సంజ‌య్ ?
  • ఎందుకీ అబ‌ద్ధాల మాట‌లు ?
  • క‌రోనా కాలంలోనూ రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా ?

బండి సంజ‌య్ మాట‌లను వింటే.. ఈ మొన‌గాడికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చిన స‌న్నాసి ఎవ‌రు ? అని తిట్టుకోకుండా ఉండ‌లేం. అలా ఉంటాయి ఈ మనిషి చేసే విమర్శలు. ఇత‌డు ఒక కౌన్సిల‌ర్‌స్థాయి వ్య‌క్తిమాత్ర‌మే. గ‌ల్లీస్థాయి లీడ‌ర్‌ను బీజేపీ అంద‌లం ఎక్కించింది. దీంతో పార్టీకి ఉన్న కాస్త ప‌రువు కూడా పోతున్న‌ది. అంద‌రూ క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే బోడిగుండు సంజ‌య్ మాత్రం స్వార్థ‌రాజకీయాల‌తో బిజీబిజీగా ఉన్న‌డు.

రైతుల కోసం ప్ర‌భుత్వం శ్ర‌మిస్తున్న ప్ర‌భుత్వంపై అన్యాయంగా నింద‌లు వేస్తూ నీచ రాజ‌కీయాలు చేస్తున్న‌డు. రైతు కొనుగోలు కేంద్రాల్లో అస‌లు స‌దుపాయాలే లేవ‌ని విమ‌ర్శించాడు. ధాన్యాన్ని స‌రిగ్గా కొంట‌లేర‌ని చిందులు వేశాడు. అధికారులు మిల్ల‌ర్ల కుమ్మ‌క్కు అయ్యార‌ని అబ‌ద్దాలు ఆడాడు. నిజంగానే ఇన్ని అన్యాయాలు జ‌రిగితే రైతులు రోడ్డెక్కి ఆందోళ‌న‌లు చేస్తారు క‌దా! ఎక్క‌డ అలాంటివి క‌న‌ప‌డ‌వేంటి సంజ‌య్ ? క‌నీసం మీడియాకు అయినా చెబుతారు క‌దా! అలాంటి స్టోరీలు (బీజేపీ కరపత్రిక వెలుగు తప్ప) కూడా ఎక్క‌డా లేవు క‌దా! నిజం చెప్పాలంటే.. ధాన్యం కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లు లేవు. ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది.

ఇంత కఠిన పరిస్థితిలో కూడా ధాన్యం సేకరణ కోసం సివిల్‌ సప్‌లైస్‌ కార్పొ రేషన్‌కు రూ. 25 వేల కోట్లు ఇచ్చారు. కార్పొరేషన్‌కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమీకరించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలోనూ ఇన్ని డబ్బు లు ఎన్నడూ ఇవ్వలేదు. మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 3,200 కోట్లు కలిపి రైతుల కోసం సుమారు రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఏర్పాట్లు లేవు. ఈసారి ఒక కోటీ 5 లక్షల టన్నుల వరి వచ్చే అవకాశముంది. ఒక్క కేజీ మిగల కుండా ప్రభుత్వమే కొంటది. ధాన్యం సేకరణ కేంద్రాల్లో, ఐకేపీల్లో అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. స్వార్థ రాజకీయాలు బీజేపీకి కొత్త కాదు. మీ స్వార్థం కోసం రైతులను బలిచేయవద్దు సంజయ్​ భాయ్​!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *