లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఆగమైతం

Lock down

  • లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఆగమైతం
  • మనకు లాక్‌ డౌన్‌ తప్పా వేరే మార్గం లేదు
  • లాక్‌ డౌన్‌తో ప్రభుత్వానికి  రోజుకు 430 కోట్ల నష్టం
  • లాక్‌ డౌన్‌ కొనసాగించాలని ప్రధానిని కోరానుః సీఎం కేసీఆర్‌

 

ఈ విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే  మళ్లీ ఆగమౌతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మనకు లాక్‌డౌన్‌ను గట్టిగ పాటించడం తప్పా మరో మార్గం లేదాన్నారు. ఇండియాలో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పాటించాలని అమెరికాకు చెందిన ప్రఖ్యాత రేటింగ్‌ సంస్థ  బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ చెప్పింది అని సీఎం గుర్తు చేశారు.  ఏప్రిల్ 15వ తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరుతానని సీఎం తెలిపారు.

లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదు అని తెలిసిన ఈ కఠిన నిర్ణయం తీసుకుంటేనే తప్పా  గట్టేక్కలేం అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు  రూ. 400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్‌ మూలంగా కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు సీఎం. ప్రజలను బతికించుకోవాలంటే లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదు. ఒక వేళ లాక్‌డౌన్‌ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తే నియంత్రించడం అసాధ్యం అని పేర్కోన్నారు.  లాక్‌డౌన్‌ సడలించడమంటే అంత ఆషామాషీ కాదు. ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాల్సిందేనని ప్రధాని మోధీని కోరానన్నారు .

ఇది ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు. ప్రపంచానికి వచ్చిన పీడ . 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్‌డౌన్‌ చేశాయి. జపాన్‌, సింగపూర్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్‌డౌన్‌ చేశాయి. మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్‌ చేశారు. కేంద్రం కంటే ముందే  మన రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామంటే లాక్‌డౌన్‌, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సాంకేతికంగ, ఆర్థికంగ మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు కూడా  ఇవాళ చేతులేత్తేశాయని గుర్తు చేశారు.  న్యూయార్క్‌ను చూస్తే శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అలాంటి దుఖం ఎవరికి సంభవించకూడదని ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *