తెలంగాణలో టిడిపికి స్థానం లేదు…

తెలంగాణలో టిడిపికి స్థానం లేదు…

  • ఉనికిలోలేని పార్టీకి కార్యవర్గాన్ని ప్రకటించడంపై సర్వత్రా విమ‌ర్శ‌లు…
  • చంద్రబాబుకు తెలంగాణవారు అంటే చిన్న చూపు…
  • జాతీయ కార్యవర్గంలో తెలంగాణ వారికి దక్కని ప్రతినిథ్యం…

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎల్.రమణను నియమించార‌నే వార్త తెగ నవ్వు తెప్పించింది. అసలు తెలంగాణలో టిడిపి పార్టీనే అంతరించిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు టిడిపి అనే పార్టీ ఉన్నట్లుగా కూడా ఎవరూ గుర్తించడం లేదని తెలుసుకుంటే మంచిది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక‌లో ఉప ఎన్నిక జరుగుతుంటే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల నిలబెట్టాయి. హోరాహోరీగా తలపడుతూ, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాత్రం పోటీ చేయడానికి అభ్యర్థి ల‌భించ‌క‌పోవ‌డంతో, పోటీ నుంచి వైదొలిగింది. ఈ ఒక్క సంఘటన చాలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దుస్థితి గురించి చెప్పడానికి. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆది నుంచి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించింది కాబట్టే  రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమిపాలైంది.

ఆరేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పగ్గాలు చేపట్టాక తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా గా మారింది. తెలంగాణ వ్యతిరేక పనులను నారా చంద్రబాబు జోరుగా చేయడంతో తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరూ మెల్లమెల్లగా ఆ పార్టీ నుంచి జారుకోవ‌డంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉనికిలో లేకుండా పోయింది. తాజాగా రెండోసారి కూడా టిడిపి అధ్యక్షుడిగా ర‌మ‌ణ‌ను ఎంపిక చేయడం ఆ పార్టీ అభ్యర్థుల కొరతను స్పష్టంగా చూపిస్తోంది. ఏదేమైనా తెలంగాణ నుంచి టిడిపి అదృశ్యం కావడానికి వందకు వందశాతం కారణం చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతి ఇప్పుడు ప్రకటించిన పార్టీ కార్యవర్గంలో తెలంగాణ ప్రజలకు స్థానం దక్కలేదు. దీన్ని చూస్తే చాలు చంద్రబాబుకు తెలంగాణ అంటే ఎంత చిన్న‌చూపో చెప్పడానికి. ఇప్పటికైనా చంద్రబాబు తెలంగాణ పై ఆశలు వదులు కుంటే మంచిది.