తెలంగాణ పథకాలను కాపి కొడుతున్న కేంద్ర ప్రభుత్వం.

కాపీమిత్వ

 

కాపీ ప్రభుత్వం…కేంద్ర ప్రభుత్వానికి ఈ పేరు చక్కగా సరిపోతుంది. ముందు తెలంగాన ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టింది. తర్వాత స్వామిత్వ. అవినీతిని అంతమొందించి..భూ వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరిగేందుకు తెలంగాన ప్రభుత్వం ధరణి ప్రవేశపెట్టింది. వ్యవసాయ, వ్యవసాయతర భూముల రిజిస్ట్రేషన్ అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుంది. తెలంగాణలో రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ప్రజలు కాల్లరిగేలా తిరిగే తిప్పలు తప్పించింది. ప్రత్యేక రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఏర్పాటు చరిత్రాత్మకమైనది. తెలంగాణ ముఖ చిత్రాన్ని ఇది మార్చివేస్తుందని పోర్టల్ ప్రారంభం రోజే సీఎం కేసీఆర్ చెప్పారు.

భూముల వివరాలు పక్కా రికార్డులతో పోర్టల్ లో కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్లు, ఇతర అవసరాల కోసం రెవెన్యూ అధికారులకు లంచాలు ఇవ్వడం తప్పడమే కాదు…ప్రజల మధ్య సరిహద్దు తగాదాలు, పంచాయితీలకు ధరణి పోర్టల్ చెక్ పెడుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ధరణి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం..ఈ విధానాన్ని కాపీకొట్టి…స్వామిత్వ అనే కొత్తపేరుతో ప్రారంబించింది. ఈ పథకం కింద ఆస్తుల సమగ్ర సర్వే, విస్తీర్ణాన్ని, యాజమాన్యాన్ని నిర్ధారించి కార్డులు జారీచేస్తారు. ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని కేంద్రం చెబుతోంది.

ఇప్పుడే కాదు…ఎప్పుడూ తెలంగాణకు స్వామిత్వ అవసరం లేదు. హైకోర్టు తీర్పుతో ధరణిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా మొదలవుతాయి. ఇక ధరణిలో సమగ్ర వివరాలు అందుబాటులోకొస్తాయి. వాటిని ఎక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. పావుగంటలో రిజస్ట్రేషన్ మ్యుటేషన్ జరుగుతుంది. మోసాలకు తావు లేకుండా…స్లాట్ బుక్ చేసుకుని, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంటి జాగాను కొలుస్తామని, దరణి పోర్టల్ ప్రారంభ సమయంలోనే కేసీఆర్ చెప్పారు.

ఇక తెలంగాణకు స్వామిత్వ అసవరం ఏముంది? స్వామిత్వ కన్నా ముందే ప్రారంభమై..అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ధరణి తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటే..ఇప్పుడు బీజేపీ నేతలు స్వామిత్వను రాష్ర్రంలో అమలు చేస్తే బాగుంటుందని తమ పత్రికల్లో రాతలు రాయిస్తున్నారంటే..వాల్లెంత ఎంత సిగ్గుమాలిన వాల్లో అర్దం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని చూసి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన పథకాన్ని మల్లీ రాష్ట్రంలో అమలుచేయాలనడం ఏమిటి? దిమాక్ లేని మాటలే కదా…ఇవి…కాస్త ఆలోచించండి…