ఉత్త  కుమారా.. ఆపు నీ చెత్త వాగుడు ప్రతి ఒక్కడికీ కరోనా టెస్టులు చేయడం అసాధ్యం

  • ఉత్త  కుమారా.. ఆపు నీ చెత్త వాగుడు
  • ప్రతి ఒక్కడికీ కరోనా టెస్టులు చేయడం అసాధ్యం
  • కేంద్ర ప్రభుత్వ రూల్స్​ ప్రకారమే టెస్టులు

 

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా ఉన్నాయి. పంజాబ్​లో అయితే మరోసారి లాక్​డౌన్​ను పొడగించాల్సిన దుస్థితి. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పేషెంట్లను పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ ఉత్త కుమార్​ రెడ్డి మాత్రం అంగీలు చింపుకుంటున్నడు. పోతురాజు లాగా ఊగుతున్నడు. కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఎలాగొలా తిట్టాలనే దూల తప్ప ఇతనికి ఏమీ తెలియదు. కరోనా గురించి బేసిక్ విషయాలు కూడా తెలియదు. అయినా ఏదో ఒకటి వాగుతడు.

కరోనా టెస్టులు ఎక్కువ చేయడం లేదంటూ మీడియా ముందు ఎగిరిపడుతున్నడు. ఈ పిచ్చోడికి తెలియనది ఏమిటంటే తెలంగాణలో రోజుకు కరోనా కేసులు పది కూడా నమోదు కావడం లేదు. మన దగ్గర 22 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. తెలంగాణలో చేపడుతున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తి ప్రకటించింది.  టెస్టుల వివరాలన్నీ చాలా డైనమిక్‌గా ఉంటాయి.  కేంద్రం, ఐసీఎంఆర్ ఇచ్చిన విధివిధానాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికే మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది.

ర్యాపిడ్ టెస్టుల వల్ల కచ్చితమైన ఫలితాలు రాకపోవడంతో వాటిని వాడటం లేదు. అసలు ఈ ర్యాపిడ్ టెస్టులపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే ఇటీవల ఐసీఎంఆర్ పలు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వెనక్కి పంపించాలని కోరింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి శాతం ఏడుగా ఉంటే… మన దేశంలో అది 3.2 శాతంగా ఉంది. తెలంగాణలో అది కేవలం 2.5 శాతం మాత్రమే. కరోనా వ్యాప్తిపై నిజాలు ఇవి. ఉత్త కుమార్​ పిచ్చిపిచ్చిగా వాగుతూ ప్రజల్లో అనవసరంగా భయాలు పెంచుతున్నరు. వీడిని ప్రజాద్రోహి అనడంలో తప్పేమీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *