ఇంత ఓటమి కాదు.. వచ్చే ఎన్నికల్లో ఇంతకన్నా ఘోరంగా ఓడిపోతారు ఉత్తమ్

  • ఇంత ఓటమి కాదు.. వచ్చే ఎన్నికల్లో ఇంతకన్నా ఘోరంగా ఓడిపోతారు ఉత్తమ్
  • మీరు ఎన్ని సమీక్షలు చేసుకున్నా వృథాయే
  • తెలంగాణలో వార్ వన్ సైడే ఉత్తమ్
  • మీ పార్టీ గోతిని మీరే తీసుకున్నారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీ గోతిని మీరే తీసి.. ఆ గోతిలో మీరే పడి.. ఆ గోతిని ఎవరు తీశారు.. అని అడుగుతున్నట్టుగా ఉంది మీ వ్యవహారం. పార్టీలో ఉండి.. పార్టీని భ్రష్టుపట్టించి.. తెలంగాణను దోచుకుతిని ఇప్పుడు వయ్యారాలు వలుకుతున్నారా? ఉత్తమ్… ఇలాంటి దెబ్బలు మీకు భవిష్యత్తులో ఇంకా చాలా తగలనున్నాయి. అన్నింటినీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఇంత ఓటమి కాదు.. ఇంతకన్నా భయంకరమైన ఓటమిని మీరు త్వరలోనే చూస్తారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. పార్టీ ఆనవాళ్లు కూడా తెలంగాణలో లేవు. పార్టీ తెలంగాణలో ఎప్పుడో చచ్చిపోయింది. దాన్ని మీరు ఎంత బతికించాలనుకున్నా వేస్ట్.
40 ఏళ్ల పాటు తెలంగాణను పాలించి మీరు చేసిన ఆగడాలు చాలు ఇక. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంకా భరించే స్థితిలో లేరు. మిమ్మల్ని నమ్మిన కాడికి చాలు ఇక. ఇంకా తెలంగాణను పట్టి పీడించకండి. తెలంగాణను ఇలాగైనా బతకనీయండి. మీ దశాబ్దాల కాలంలో ఏనాడూ తెలంగాణను పట్టించుకోని మీరు ఇప్పుడు తెలంగాణ గురించి బాగా మాట్లాడుతున్నారు. దశాబ్దాల పాలనలో మీకు ఏనాడూ తెలంగాణ అభివృద్ధి గుర్తుకురాలేదు. కేవలం మీ పొట్టలు నింపుకున్నారు. దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు.
మీరు ఎన్ని కసరత్తులు చేసినా.. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే తీర్పు వస్తుంది ఉత్తమ్. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఫిక్స్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఉత్తమ్. ఇకనైనా అన్నీ వదిలేసి… మీ పాపాలను కడిగేసుకోండి. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవండి. అప్పుడైనా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. తెలంగాణలో పుట్టినందుకైనా తెలంగాణ గడ్డ రుణం తీర్చుకోండి. తెలంగాణను నాశనం చేస్తే.. కన్న తల్లిదండ్రులను మోసం చేసినట్టే. చిరకాలం మీరు తెలంగాణ ద్రోహులుగానే మిగిలిపోతారు జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *