రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదా ? ఒక్క ఆధార‌మైనా చూపిస్త‌వా గ‌డ్డ‌పోడా ?

  • రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదా ?
  • ఒక్క ఆధార‌మైనా చూపిస్త‌వా గ‌డ్డ‌పోడా ?
  • మ‌న తెలంగాణలో రైతే రాజు!
  • కేసీఆర్ రైతుపక్షపాతి

రైతుల క‌ష్టాల గురించి ఏనాడూ ఆలోచించ‌ని కాంగ్రెస్ పార్టీ వారి గురించి మొస‌టి క‌న్నీళ్లు కార్చుతోంది. అన్న‌దాత‌ల బాధ‌ల గురించి క‌ల‌లోనూ ఆలోచించ‌ని పీసీసీ బాసు ఉత్త కుమార్ రెడ్డి ప్ర‌భుత్వానికి నీతులు చెబుతున్నారు. లాక్ డౌన్ వ‌ల్ల రైతులు క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న‌ర‌ట‌.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. కేసీఆర్ ప్ర‌భుత్వం 24 గంట‌లూ క‌ష్ట‌ప‌డుతున్నా ఈ గ‌డ్డ‌పోడు ఇలా మాట్లాడుతుండ‌టం దారుణం. త‌మ పాల‌న‌లో రైతుల‌ను అష్ట‌క‌ష్టాల‌కు గురి చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు సుద్దులు చెబుతున్న‌ది.

అకాల వర్షాలు, లాక్డౌన్, రవాణా సదుపాయాలు లేకపోవడం, లేబర్ కొరత కారణంగా అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు ప‌డుతున్న మాట నిజం. చేతికొచ్చిన పంటలు అందకుండా పోవడంతో వాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. మన ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొంటున్నది.  రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోనైనా రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన భరోసా రైతుల్లో గుండె ధైర్యాన్ని నింపింది.

రైతులను ఆదుకోవడంలో భాగంగా లాక్డౌన్ నుంచి వ్యవసాయరంగాన్ని మినహాయించింది. పళ్లు, ధాన్యం వంటి వాటి రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నది.   అందుకే వరి, మక్కజొన్న, పత్తి, కందుల మామిడికాయ కొనుగోలు కేంద్రాలను అన్ని చోట్లా ఏర్పాటు చేసింది.  పంట నగదు నేరుగా ఖాతాల్లో అందించాలనే ధృడనిశ్చయంతో  కేసీఆర్ పనిచేస్తున్నారు. వడగండ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్నివిధాలుగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *