మీ నాటకాలకే తగిన ఫలితాలు వచ్చాయి.. అయినా బుద్ధి రాలేదా ఉత్తమ్?

మీ నాటకాలకే తగిన ఫలితాలు వచ్చాయి.. అయినా బుద్ధి రాలేదా ఉత్తమ్?

  • వద్దురా బాబూ అంటే వినలేదు.. చివరకు కుక్క చావు చచ్ఛారు
  • ఘోర పరాజయం పాలైనా.. కాస్తంటే కాస్త కూడా మారని కాంగ్రెస్ నేతలు
  • సీఏఏపై స్థిరమైన అభిప్రాయంతో ఉన్న కేసీఆర్ పై అర్థరహిత విమర్శలు

కేసీఆర్ ఓ మాట అన్నారంటే.. ఓ చేత చేశారంటే.. అంతే. ఆయన ఆ మాట జవదాటరు. తను గీసుకున్న గిరిని ఏనాడూ దాటి ముందుకు వెళ్లరు. అంతటి మహా నాయకుడు కాబట్టే.. కేంద్రం ప్రతిపాదించిన సీఏఏ విషయంలో నిక్కచ్చితనాన్ని వ్యవహరిస్తున్నాడని ప్రజలు కీర్తిస్తున్నారు. అందుకే.. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి రాకున్నా.. ఆయన మాటకున్న శక్తిని, ఆయన చేతలకున్న సంక్షేమ ఖచ్చితత్వాన్ని తెలుసుకుని ఘన విజయాన్ని అందించారు.

ఇది చూసి.. కాంగ్రెస్ నేతల కళ్లు కుడుతున్నట్టున్నాయి. అభివృద్ధి విషయంలో విమర్శలు చేయలేమని అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు.. చివరికి సీఏఏ వ్యవహారంపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిని పీసీసీ కాబోయే మాజీ చీఫ్ తప్పుబడుతున్నారు. సీఏఏపై కేసీఆర్ నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. తన పార్టీతో పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేయించినా కూడా.. ఉత్తమ్ ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు కూతలు కూశారు.

కేసీఆర్ ప్రజలకు స్వేచ్ఛనివ్వడం లేదంట. ఇదే నిజమైతే.. దాదాపు ఆరేళ్లుగా ప్రజలు రాష్ట్రంలో ఇంత ప్రశాంతంగా ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కావడం లేనట్టుంది. బెదిరింపులతో నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారట. ఇదే నిజమైతే.. నిన్నూ బెదిరించి.. పార్టీలో చేర్చుకోవాలి కదా. మరి ఆ పనిని కేసీఆర్ ఎందుకు చేయలేదో చెప్పగలవా ఉత్తమ్..  అని జనాలు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ ను దెబ్బతీయాలని టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆరోపించారు. కానీ.. నిత్యం ఈ మూడు పార్టీలు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలతోనే కాలం గడుపుతున్న విషయాన్ని ఉత్తమ్ విస్మరించారు. అందుకే.. ఉత్తమ్ ను ప్రజలు తిరస్కరించారు. ఇది అర్థం చేసుకున్న తాను కూడా.. తనను తాను తిరస్కరించుకుని.. త్వరలో పీసీసీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు.

పార్టీని నడపలేని అసమర్థతను.. రాజీనామా సంకేతాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకొన్నారు. ఇదంతా తనకు తెలిసినా తెలియనట్టు.. అర్థమైనా కానట్టు వ్యవహరిస్తున్న ఉత్తమ్ ను.. ఉత్త నాయకుడినా జనాలు ఎప్పుడో మార్చేశారు. కాబట్టి మనం కూడా అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఉత్తమ్ కథ.. ఒడిశిన ముచ్చట కాబట్టి. ఏమంటారు.. కోదాడ, హుజూర్ నగర్ ప్రజలారా.. నిజమే కదా.

Leave a Reply

Your email address will not be published.