బిజెపి కరపత్రికగా మారి,  జర్నలిజం విలువలకు పాతరేస్తున్న Velugu & V6

 

కెసిఆర్ పై ద్వేషంతో చీకటిలోకి జారిపోతున్న వెలుగు దినపత్రిక…

రెండేళ్ల పాలనపై విష‌ ప్రచారంతో అందరి దృష్టిలో చులకనైన పత్రిక…
బిజెపి కరపత్రికగా మారి,  జర్నలిజం విలువలకు పాతరేస్తున్న యాజమాన్యం…

భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు అంధ‌ భక్తులు అనే పేరు ఉన్నట్లుగానే వెలుగు దినపత్రిక కూడా రోజురోజుకు కళ్ళు ఉన్న కబోదిలా గా మారిపోతుంది. తాజాగా రెండేళ్ల  తెలంగాణ ప్రభుత్వం పాల‌న‌లో అభివృద్ధి ఏమి జరిగిందని ఆ పత్రిక ఆ బ్యానర్ కథనం వడ్డించడం పై అందరూ అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ లో అమలవుతున్న సంగతి మీకు తెలియడం లేదా.

 

దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడులు తరలి పోతుంటే తెలంగాణలో మాత్రం తాజాగా అమెజాన్ సంస్థ 21 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టిన విషయం కావాలనే విస్మరిస్తోందా లేక నిద్ర న‌టిస్తోందా. భారతీయ జనతా పార్టీ కి కరపత్రిక గా మారి తన పాఠకులను మోసం చేయాలనుకుంటే ఆ పత్రిక పప్పులు ఉడకవు అని తెలుసుకుంటే మంచిది. ఇప్పటికే వివిధ ఎన్నికల సందర్భంగా విశ్వసనీయత కోల్పోయిన వెలుగు పత్రిక తాజాగా కథనంతో మరోసారి నవ్వుల పాలైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిజెపి పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు కనీసం సగం కూడా అమలు కావడం లేదు. దీనిపై దమ్ముంటే చర్చకు సిద్ధమా అని టిఆర్ఎస్ శ్రేణులు బహిరంగ సవాల్ విసురుతున్నారు. కానీ వెలుగుకు అంబ ప‌ల‌క‌డం లేదు.

మాట ఇచ్చి తప్పడం తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిక్షనరీలోనే లేదు అని అందరికీ తెలుసు. ఇలాంటి చర్చ కథనాలతో సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయాలనుకోవడం సూర్యునిపై ఉమ్ము వేయడం లాంటిదేనని వెలుగు పత్రిక తెలుసుకోవాలి. ఆరేళ్ల పసిప్రాయంలోని ఒక రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేయడం కొమ్ములు తిరిగిన నేతల కూడా సాధ్యం కాదు కానీ సీఎం కేసీఆర్ చిటికెలో చేసి చూపించారు. నిజానికి ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి ప్రజల తరఫున పోరాడాలని అనుకుంటే ఉద్యమాలు చేయొచ్చు అంతేకాని తమ కరపత్రిక లాంటి వెలుగులో ఇలాంటి రాతలు రాయడం ద్వారా ఆ పత్రిక తో పాటు పార్టీ ఇజ్జతు గంగలో కలవడం ఖాయమని తెలుసుకోవాలి.

 

బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంలోనూ ఇన్నాళ్లుగా తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణాకు ఒక్కపైసా అదనంగా నిధులు విడుద‌ల చేయలేదు.  వీళ్లు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రాన్ని విడుదల చేయించే ద‌మ్ము పౌరుష‌ముందా. ఇది చేత‌గాక‌పోతే నోర్ముసుకుని ఉండాలి.  అంతేగాని ఇష్టం ఉన్నట్టు వాగితే భారతీయ జనతా పార్టీ నేతలతో తరిమికొట్టడం ఖాయమని గ్రహిస్తే మంచిది. త‌స్మాత్ జాగ్ర‌త్త‌