వరద సాయంపై బురద రాతలు

 

వరద సాయంపై బురద రాతలు

వదరలొచ్చినయి…ఊరూ,ఏరూ ఏకమయినయి…సీఎం కేసీఆర్ ను ఎవరన్నా అడిగిండా…పదివేలు డబ్బులు ఇయ్యమని…మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరదలో మునిగిపోయిన ప్రాంతాలను చూశారు. గూడు చెదిరిపోయి నగరజీవి పడుతున్న వెతలను గమనించారు. వరదబాధల గురించి స్వయంగా తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. ఎవరూ అడగకుండానే వరం ప్రకటించారు. ఒక్కో వరద బాధిత కుటుంబానికి పదివేలు అందిస్తామన్నారు.

చెప్పినట్టుగా…సాయం పంపిణీ ప్రారంభించారు. చెప్పినట్టుగా తక్షణమే ప్రభుత్వం వరదసాయం అందించడం, ప్రజలకు ఉపశమనం కలగడం చూసేగా మీకు కన్నుకుట్టింది. ఎన్నికల కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాయడం వల్లేగా వరదసాయంపై ఆంక్షలు విధించింది ఈసీ. ఎన్నికలకు ముందే చాలా కుటుంబాలకు వరద సాయం అందింది. ఎంతో మంది పదివేలు సాయం అందించినందుకు ప్రభుత్వానికి క్రుతజ్నతలు చెప్పారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులందరికీ వరద సాయం అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలకు ముందు సాయం కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల దగ్గరకు భారీగా తరలివచ్చారు.

ప్రజలకు మల్లీ అలాంటి కష్టం కలగకుండా..జీహెచ్ఎంసీ అధికారులే  క్షేత్రస్థాయిలో పర్యటించి…అర్హులను గుర్తించి సాయం అందిస్తామని ప్రకటించారు. మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా..బాధితుల దగ్గరకే అధికారులను పంపిస్తానంటోంది ప్రభుత్వం. ఇంక ఇందులో కిరికిరి ఏముంది? అర్హులను గుర్తించి…నేరుగా ఎకౌంట్లలోకి డబ్బులు జమచేస్తానని చెప్పింది..వరదసాయం హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంది? సీఎం కేసీఆర్ ప్రజల్లోనుంచి వచ్చిన నాయకుడు.

జనాల బాధలు తెలిసిన నేత. ఎవరికి ఏం కావాలో…ఎవరి అవసరాలేంటో…కుటుంబ పెద్దలా గుర్తించి..అందరికీ అన్నీ సమకూరుస్తారు. చెప్పినవీ..చెప్పనవీ కూడా చేస్తారు కేసీఆర్. అంతేగానీ కేంద్రంలోని బీజేపీ తీరు కాదు..టీఆర్ఎస్ ప్రభుత్వం. నల్లధనం వెనక్కి, ఐదు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు..ఇలా ఒక్క హామీ నెరవేర్చకుండా…సిగ్గులేకుండా…తిరిగే లెక్క కాదు సీఎం కేసీఆర్. ఆయన నిఖార్సయిన నాయకుడు. వరద సాయం సహా ఏ ఒక్క హామీపై వెనక్కి తగ్గడు సీఎం. వాస్తవాలు రాయకుండా…బురద రాతలు రాయడం మానుకోవాలి బీజేపీ పత్రికలు, సైట్లు..లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.