తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకునే చ‌ర్య‌లు నీకు చెప్పి తీసుకోవాల‌…

 

 

  • వెలుగు.. పోతిరెడ్డిపాడుపై నీ హ‌డావిడేంది..
  • తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకునే చ‌ర్య‌లు నీకు చెప్పి తీసుకోవాల‌…
  • నీకు, ఏపీకి జాయింట్‌గా షాక్ త‌గ‌ల‌డం ఖాయం..
  • అప్పటివ‌ర‌కు కాస్త ఓపిక ప‌ట్టు.. జ‌ర ఉబ్బు ఆపుకో..

పొతిరెడ్డిపాడు పొక్క‌పెంచేందుకు ప్ర‌యత్నిస్తున్న ఆంధ్ర స‌ర్కారుకు తెలంగాణ ప్ర‌భుత్వం క‌చ్చితంగా షాకిస్తుంది. అయితే అప్ప‌టివ‌ర‌కు వెలుగు ప‌త్రిక‌కు ఉబ్బు ఆగ‌డం లేదు. ఏమీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ఊక‌దంపుడు రాత‌ల‌కు దిగుతోంది. అంటే తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చ‌ర్య‌లు తీసుకున్నాగానీ, వెలుగు ప‌త్రిక‌కు చెప్పే తీసుకోవాలా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌లాంటి అప‌ర చాణ‌క్యుని ముందు పిల్ల‌కుంకా , ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ప్పులేమీ ఉడ‌క‌వు.

ఇప్ప‌టికే కార్య‌చ‌ర‌ణ‌ను ప్రారంభించిన తెలంగాణ‌.. త్వ‌ర‌లోనే ఆంధ్ర‌కు త‌గిన‌బుద్ధి చెబుతోంది. మ‌రోవైపు పోతిరెడ్డిపాడుకు మూల‌మైన కాంగ్రెస్ నేత‌లు నేడు గొంతు చించుకు ఒర్రుతుంటే విచిత్రంగా ఉంది. నాడు గాజులు వేసుకుని ద‌ద్ద‌మ్మల్లా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముందు నిలిచిన కాంగీలు.. నేడు మాట్లాడ‌డం వింత‌లోకెల్లా వింత‌. మిమ్మ‌ల్నీ, మీ బ‌ఫూన్ చేష్ట‌ల్ని చూసి ప్ర‌జ‌లు ఛీ కొడుతున్నారు.

 

తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కోసం ఎక్క‌డిదాక వెళ్లైనా కొట్టాడేందుకు టీఆరెస్ పార్టీ, సీఎం కేసీఆర్ స‌దా సిద్ధం.. ఇప్ప‌టికే ఈ విష‌యం అనేక సార్లు రుజువైంది. ఇప్పుడొచ్చిన పొతిరెడ్డిపాడు పొక్క విష‌యాన్ని కేసీఆర్ త‌న‌దైన‌శైలిలో పరిష్కారిస్తార‌న్న న‌మ్మ‌కం అందరిలోనూ ఉంది. అందుకే కేసీఆర్‌కు బాధ్య‌త అప్ప‌గించిన అంద‌రూ నిమ్మ‌లంగా ఉన్నారు. ఒక్క వెలుగు ప‌త్రికకే ఊపిరాడుతలేదు. ఆగ‌మాగం చేస్తాంది. ఏపీ అతి తెలివికి, వెలుగు అతి హుషారుకు త్వ‌రలోనే షాక్ త‌గ‌లనుంద‌ని తెలుసుకుంటే మంచిది.