కృష్ణ నీళ్ల‌పై వెలుగు ప‌త్రిక చీక‌టి ప్ర‌చారం..

 

  1. కృష్ణ నీళ్ల‌పై వెలుగు ప‌త్రిక చీక‌టి ప్ర‌చారం..
  2. కావాల‌నే తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు..
  3. క‌ళ్లుండి క‌బోదిలా వ్య‌వ‌హ‌రిస్తున్న దుష్ట ప‌త్రిక‌..
  4. మీకు పోయేకాలం దాపురించింది.. అందుకే ఇలాంటి తిక్క రాత‌లు..

కృష్ణా వాట‌ర్‌పై తెగ పెడ‌బొబ్బలు పెడుతున్న వీ6 చానెల్ కావాల‌నే ఉద్దేశ‌పూర్వకంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతోంది. నాడు కృష్ణా నీటిని తోడుకుపోడానికి కార‌ణ‌మైన కాంగ్రెసొళ్ల‌ను ఒక్క మాట అన‌కుండా, కేవలం తెలంగాణ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకే సంగ‌ప్ప‌తో వ్యాసాన్ని రాయించిన‌ట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది బీజేపీ ప్ర‌భుత్వ‌మేకాదా, మీ పత్రిక య‌జ‌మాని వివేకానంద‌తో చెప్పించి, పోతిరెడ్డి పాడు పొక్క వెడెల్పును ఆప‌లేక‌పోయించక ఎందుకీ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు. మీతో ఊదు కాలేదీ లేదు.. పీరు లేచేది లేదు. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స‌హా ప్ర‌భుత్వ ముఖ్యులు స్పందించిన సంగ‌తి నీకు తెలువ‌దా.. వెలుగు.. కావాల‌నే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నావా.. న‌ర‌న‌రానా కేసీఆర్‌, టీఆరెస్ వైఖ‌రిని జీర్ణించుకున్న నీకు.. అన్ని అలాగే క‌న్పిస్తాయి. అందుకే ఇలాంటి త‌ల‌తిక్క వాద‌న‌లతో నీ పైత్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నావ్‌..

ఇక కృష్ణ‌మ్మ నీటిని ప్ర‌భుత్వం ఎంతో ముందుచూపుతో వాడుకుంటోంది. ఇప్పటికే అనేక లిఫ్టులు క‌ట్టి, రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామలం చేయాల‌ని సీఎం కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నారు. గ‌త ఆరేళ్లుగా సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి న‌మోదైంది. సీమాంధ్ర పాలకులకు ప‌ట్ట‌ని ఎన్నో ప్రాజెక్టుల‌ను సీఎం కేసీఆర్ పూర్తి చేయ‌డ‌మే గాకుండా, కాళేశ్వ‌రం, మిష‌న్ కాక‌తీయ‌లాంటి ఎన్నో వినూత్న ప్రాజెక్టుల‌ను రూపొందించారు. ఇప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చి పోతిరెడ్డిపాడును సీఎం కేసీఆర్ త‌న‌దైన‌శైలిలో పరిష్క‌రిస్తారు. వెలుగు నీ చీక‌టి రాత‌ల‌ను ఆప‌క‌పోతే.. నీకు చిప్పే గ‌తి.