భయభ్రాంతులకు గురి చేయకండి.. ప్రత్యామ్నాయాలూ రాయండి!

భయభ్రాంతులకు గురి చేయకండి.. ప్రత్యామ్నాయాలూ రాయండి!

  • 3 జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయంటూ వెలుగు పత్రిక రాతలు
  • కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించని దారుణ వైనం
  • ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పేజీలు నింపుతున్న వైఖరి

పోతిరెడ్డిపాడు. ఈ విషయం.. ప్రభుత్వ వ్యతిరేక పత్రికలకు, విపక్షాలకు ఓ ఆయుధంగా మారింది. ఈ అత్యుత్సాహాన్ని సదరు దుష్ట శక్తులు.. అభూత కల్పనలకు, జనాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు వాడుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాల్లో వెలుగు దిన పత్రిక ముందు వరసలో నిలవాలన్న ఆరాటాన్ని తెగ ప్రదర్శిస్తోంది. ఎందుకంటే.. పోతిరెడ్డిపాడు గండి సామర్థ్యాన్ని పెంచితే.. జరిగే నష్టాన్ని వివరించే క్రమంలో జనాలు భయకంపితులయ్యేలా రాతలు రాసి పత్రికను ప్రజల్లోకి వదిలింది.

నిజంగా పోతిరెడ్డిపాడు గండి సామర్థ్యం పెంపు ప్రతిపాదన వాస్తవరూపం దాలిస్తే.. తెలంగాణకు కలిగే నష్టం కన్నా.. ఎక్కువ నష్టాన్ని చూపిస్తున్నట్టుగా వెలుగు పత్రిక తీరుపై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రజలు ఓపెన్ గానే రెండు బలమైన కారణాలను చూపిస్తున్నారు. ఒకటి.. పోరాటయోధుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా.. మన ప్రజల హక్కులను ఆంధ్రప్రదేశ్ హరించుకుపోదు.. అన్న విషయాన్ని బలంగా చాటుతున్నారు. ఇప్పటికే.. ఏపీ ప్రతిపాదనపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఆ దిశగానే ఉన్నాయని ఉదహరిస్తున్నారు.

పైగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే.. తమకు అనుమతి ఉన్నంతవరకే కృష్ణాలో నీళ్లు వాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఆ లెక్కన చూసినా.. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే అవకాశాలు తక్కువగానే ఉండవచ్చు కదా.. అన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న మరో అభిప్రాయం. నిజంగా.. ఏపీ ప్రభుత్వం గనక.. మొండికేస్తే.. కేసీఆర్ ఒక్కరే కాదు. విపక్షాలుగా.. తెలంగాణకు మంచి చేసే ప్రయత్నం చేసి.. న్యాయ పోరాటం చేస్తే తప్పా.. అని నజనాలు నిలదీస్తున్నారు. ఇలాంటి విష ప్రచారాలతో అమాయకులను ఆందోళనకు గురి చేయవద్దని కోరుతున్నారు.

ప్రజా క్షేత్రం అన్నది ఎప్పుడూ సజీవంగా ఉంటుందని.. ఇలాంటి రాతలతో నిర్జీవం చేయవద్దని జనాలు వెలుగు పత్రికకు స్పష్టం చేస్తున్నారు.