- వెలుగు పత్రిక యాజమాన్యమా.. మీకు అసలు సోయి ఉందా..
- సంక్షేమంపై బురద జల్లాలని చూస్తే, మీ ముఖాలే నల్లగైతయ్..
- అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెం.1..
- ఇప్పటికైనా మీ లుచ్చా రాతలను ఆపండి.. లేకుంటే తగిన శాస్తే..
బుధవారం (మే 27న) వెలుగు దిన పత్రిక బ్యానర్‌గా ప్రచురించిన వార్తను చూస్తే పొట్టచెక్కలవుతోంది. సంక్షేమానికి మారుపేరైన తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అందరికీ అందడం లేదని శుష్క వార్తను వండి వారించింది. నిజానికి దీన్ని రాసిన రిపోర్టర్‌తోపాటు దిద్దిన సబ్ ఎడిటర్, పత్రిక యాజమాన్యానికి అసలు తలకాయ ఉందా అని డౌటనుమానం. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి.
కేంద్రంతో సహా కొన్ని రాష్ట్రాలు అమలు చేసి మంచి ఫలితాలు పొందాయి. దేశవ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ నెం.1గా నిలిచిందని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. అలాంటి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందడం లేదని పిచ్చి వార్తలు రాస్తే నమ్మేంత అమయాకులు, పిచ్చి పుల్లయ్యలు ఎవరూ లేరిక్కడ. దమ్ముంటే పూర్తి ఆధారాలతో వార్తలు రాయాలి గానీ, వ్యక్తిగత ద్వేషంతో ఇలాంటి పనులు చేస్తే చీరి చింతకు కడుతారు.
కొన్ని చోట్ల దరఖాస్తులు తీసుకుని పరిశీలనలో ఉన్నప్పటికీ అది వెలుగు చెబుతున్నంతగా లక్షల సంఖ్యలో లేదు. ఇది మాములు విషయమే.. కొత్తగా లబ్ధిదారులు వివిధ పథకాలకు అప్లై చేసుకోవడం, అధికారులు పరిశీలించడం సర్వ సాధారణమే. దీన్నీ పట్టుకుని ఎదో బొంబాట్ స్టోరీ చేద్దామని భావించిన వెలుగు.. ఆఖరికి కొండను తవ్వి ఎలుకును పట్టిన చందంలా మారిపోయింది. పైసలు పెట్టి కొంటున్న మీ పాఠకులను నిజాలను అందించండి.. అడ్డమైన రాతలను కాదు..