టీడీపీ.. మీకు నాలుగు సీట్లు కూడా ఎక్కువే

  • టీడీపీ.. మీకు నాలుగు సీట్లు కూడా ఎక్కువే
  • ద‌మ్ముంటే ఒంటరిగా పోటీ చేసి ఒక్క‌సీటైనా గెలుస్తారా..
  • మీ మాయ‌కూట‌మిని ఎవ‌రు న‌మ్మ‌బోరు
  • కేసీఆర్ కే నిరాజనాలు ప‌లుకుతున్న జనం

కేసీఆర్‌కు ల‌భిస్తున్న ప్ర‌జాధ‌ర‌ణ‌ను చూసి టీడీపీ నేత‌లు కుళ్లుకుంటున్నారు. క‌ళ్లున్న క‌బోదులైన ఈ నాయకులకు టీఆరెస్ స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూసి వెన్నులో వ‌ణుకుపుడుతోంది. తెలంగాణాలో క‌నీస‌స్థాయిలో బ‌లం లేని ఈ నాయ‌కులకు వ‌చ్చే ఎన్నిక‌ల్లు పెద్ద ప‌రీక్ష‌లా ప‌రిణ‌మించాయి. కాంగ్రెస్‌, టీజేఎస్ లాంటి ద్రోహ‌లతో క‌లిసి మ‌యా కూట‌మిని ఏర్పాటు చేసిన వీరంతా.. ప్ర‌చారానికి వెళితే జ‌నం త‌రిమికొడుతారని భ‌య‌ప‌డుతున్నారు. అందుకే కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. సొంతంగా పోటీచేస్తే ఒక్క సీట్లోనూ డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేని ఈ చ‌వ‌టలు కేసీఆర్‌ను మాత్ర టార్గెట్ చేస్తున్నారు. అవును.. మొన్న అన్న‌దాంట్లో త‌ప్పేముంది. మీకు తెలంగాణాలో నూక‌లు చెల్లిపోయాయి. ఇక రాష్ట్రంలో టీడీపీది ఒడిసిన ముచ్చ‌టే. రేప‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విదిల్చే ఒక‌టి రెండు సీట్ల కోసం గోతి కాడి న‌క్క‌ల్లాగా ఎదురు చూస్తున్నారు. అస‌లు కార్య‌క‌ర్త‌లు కూడా స‌రిగా లేని మీదో పార్టీ.. దానికో అజెండానా.. ఈ సారి ఎన్నిక‌లు ముగిశాక ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని బంగాళాఖాతంలో క‌లుపుతార‌ని అన్ని అంచానాల్లోనూ స్ప‌ష్ట‌మైంది. ఈక్ర‌మంలో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు స‌మాధి కాబోతుంద‌ని ఆందోళ‌న‌లో ఏవేవో మాట్లాడుతున్నారు.

టీడీపీతో క‌ల‌సి ఇత‌ర పార్టీలు ఏర్పాటు చేసిన మాయ కూట‌మికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్ప‌బోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ముంద‌స్తు అస్త్రానికి చిత్తయిన ప్రతిప‌క్షాలు.. ఓట‌మికి ముందే సిద్ధమై మ‌హాకూట‌మిపేరిట క‌ల‌గూర గంప‌లాగా బ‌రిలోకి దిగుతున్నాయి. తెలంగాణ ద్రోహుల‌తో నిండిన మ‌హా కూట‌మికి అధికార‌మిస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తార‌ని గుర్తించిన రాష్ట్ర ప్రజ‌లు.. కేసీఆర్ పేర్కొన్న విధంగా బంప‌ర్ మెజారిటీని టీఆరెస్‌కు అందించి రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు.  మ‌హా కూట‌మి మూల స్థంభాలైన ఉత్తమ్ కుమారుణ్ని, తెలంగాణ ద్రోహులు ర‌మ‌ణ‌, కోదండ‌రాం. ప్రజ‌లెప్పుడో మ‌రిచిపోయిన క‌మ్యూనిస్టుల్ని ప్రజ‌లు త్వర‌లోనే త‌రిమికొట్టే రోజు రానుంది. నాలుగున్నర ఏళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, దేశం దృష్టిని ఆక‌ర్శించిన కేసీఆర్‌కు ఈసారి ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టాల‌ని మాన‌సికంగా ఎప్పుడో సిద్ధమ‌య్యారు. పేద‌ల సంక్షేమం, అన్ని వ‌ర్గాల అభ్యున్నతికి పాటుప‌డే టీఆరెస్‌ను ఈ ఎన్నిక‌ల్లో గెలిపించాల‌నే చారిత్రక అవ‌స‌రాన్ని గుర్తించిన ప్రజ‌లు అందుకు న‌డుం బిగించారు. ఈసారి మా ఓటు టీఆరెస్‌కేన‌ని ప్ర‌జ‌లు ఏక‌గ్రీవంగా తీర్మాణిస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీఆరెస్ బంప‌ర్ మెజారిటీ సాధించి చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మాని ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.