ప్రజల్ని మోసగించింది, నిండా ముంచింది బీజేపీయే జీవీఎల్. 

 

  • హైదరాబాద్ మినహా బయట ఎక్కడా ఒక్క సీటు రాదు.
  • ఈసారి తెలంగాణ మొత్తంలో సింగిల్ డిజిట్ అయిన సాధిస్తారో లేదో.
  • కానీ టీఆర్ఎస్ పై లేనిపోని విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.

టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసిందంటున్న బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు.. ఏం మోసం చేసిందో చెప్పాలి. 60ఏళ్ల ప్రజల కలల్ని నెరవేర్చడం మోసమా?. నాలుగేళ్లలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపెట్టడం మోసమా?. లేక ప్రభుత్వ ఫలాలను కుల, మత భేదాలు లేకుండా అందరికీ అందేలా చేయడం మోసమా?. టీఆర్ఎస్ ఏం మోసం చేసింది. జాతీయ ప్రాజెక్టులే నత్తనడకన సాగుతున్న సమయంలో.. కాళేశ్వరాన్ని పరుగులు పెట్టించి పూర్తి దశకు తీసుకురావడం మోసమా?. వలసల జిల్లా పాలమూరులో కొత్తగా 8లక్షలకు పైగా ఆయకట్టు తీసుకురావడం మోసమా?. చెప్పు జీవీఎల్ సమాధానం చెప్పు.

జై తెలంగాణ అని స్పష్టంగా పలకడం కూడా చేతకాని బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంటే నవ్వొస్తుంది. తెలంగాణను వ్యతిరేకించిన జీవీఎల్ నరసింహారావు లాంటి ఆంధ్రా నాయకులు ఇక్కడికి వచ్చి అధికారంలోకి వస్తామని అంటున్నారు. మిస్టర్ జీవీఎల్ నరసింహారావు ముందు నీది నువ్వు చూసుకుని.. ఆ తర్వాత తెలంగాణ సంగతి మాట్లాడు. ఆంధ్రాలో అడుక్కుతినే పొజిషన్ లో మీ పార్టీ ఉంది. అక్కడ రాజకీయాలు చేయడం చేతకాదని.. తెలంగాణకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నావా?. నీ ఆంధ్రా తెలివి తెలంగాణలో చూపిస్తానంటే కుదరదు.

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఓట్లెయ్యాలో.. జీవీఎల్ నర్సింహారావు చెప్పాలి. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీలోని టీడీపీతో పొత్తు పెట్టుకుని.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారు. ఇప్పటికీ అదే వివక్ష కొనసాగిస్తున్నారు. తెలంగాణ కోరిన వాటిల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా… న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల విషయంలోనూ బీజేపీ ద్రోహం చేసింది. తెలంగాణను మోసం చేస్తున్న పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు అస్సలే ఉండవు. ఎక్కడి నుంచో వచ్చి.. ఇక్కడ రాజకీయాలు చేస్తానంటే.. తెలంగాణ ప్రజలేం తెలివి తక్కువ వాళ్లు కాదు జీవీఎల్. భారతీయ జనతా పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా.. తెలంగాణలో అధికారంలోకి రాలేదు. మోడీ, అమిత్ షా వచ్చి ఇంటింటి పర్యటనలు చేసినా.. తెలంగాణ ఓటర్లు బీజేపీకి ఓట్లెయ్యరు.

 

6 thoughts on “ప్రజల్ని మోసగించింది, నిండా ముంచింది బీజేపీయే జీవీఎల్. 

Leave a Reply

Your email address will not be published.