టిమ్స్ ఓ ఇంద్రభవనం రేవంత్ రెడ్డి.

 

  • టిమ్స్ ఓ ఇంద్రభవనం రేవంత్ రెడ్డి.
  • అత్యాధునిక వసతులతో టిమ్స్ ఏర్పాటైంది.
  • సిబ్బంది కేటాయింపు కాలేదు. అందుకే…
  • ప్రస్తుతం టిమ్స్ లో సేవలు అందించడం లేదు.
  • కానీ.. రేవంత్ మాత్రం టిమ్స్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

గచ్చిబౌలిలో.. తెలంగాణ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ను ప్రభుత్వం.. వేగంగా నిర్మించింది. 1500 పడకలతో.. ఆస్పత్రిని అత్యాధునిక వసతులతో రూపొందించింది. దీనికోసం 600మంది వైద్యులు, వైద్య సిబ్బందిని కేటాయించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. సిబ్బంది కేటాయింపు జరుగుతోంది. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా కట్టిన ఈ హాస్పిటల్ ను చూసి గర్వపడాల్సింది పోయి విమర్శలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఊ అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. టిమ్స్ లో అన్నీ సర్వం సిద్ధం ఉన్నాయి. నీ కళ్లతో నువ్వు కూడా చూశావ్ కదా?. ఓన్లీ స్టాఫ్ రిక్రూట్ మెంట్ మాత్రమే మిగిలింది.

కరోనా పేషెంట్లకు చికిత్స అందించాలంటే.. వారికి కావాల్సిన స్పెషాలిటీ వైద్యులు కావాలి. ఇప్పుడున్న ఆస్పత్రులకే వైద్యుల కొరత వెంటాడుతోంది. ఈ సమయంలో.. కరోనా ప్రత్యేక ఆస్పత్రిలో పనిచేయడానికి కొందరు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకే స్టాఫ్ రిక్రూమ్ మెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. వైద్యులు ముందుకు రాకపోవడంతోనే టిమ్స్ లో ఇంకా వైద్య సేవలు ప్రారంభించలేదు. కేవలం 15రోజుల్లో 1500 పడకల ఆస్పత్రి తయారు చేయడం అంటే ఆషామాషీనా?. ఒకవేళ మున్ముందు.. కరోనా రోగులు పెరిగితే.. వారికి టిమ్స్ హాస్పిటలే పెద్ద దిక్కు అవుతుంది.

సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని నువ్వెలా అంటవ్. ముఖ్యమంత్రిగా చేయాల్సింది కేసీఆర్ చేస్తున్నాడు కదా?. కేసీఆర్ పాలనతోనే ఇవాళ తెలంగాణ అంటే దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వైద్యశాఖ మంత్రిని పొలాల్లో దిష్టిబొమ్మ అంటవా?. రోజూ రివ్యూలు నిర్వహిస్తూ.. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తూ 2వేల మందిని కోలుకుని ఇంటికి పోయేలా చేయడంలో మంత్రి ఈటల పాత్ర లేదంటవా??. వైద్య శాఖ మంత్రి కాదు.. రాష్ట్రానికి అసలైన దిష్టిబొమ్మ నువ్వే రేవంత్. అందుకే ప్రతీదాంట్లో ప్రభుత్వ తప్పులెంచుతూ రాష్ట్రానికి శనిలా మారావ్. ఫస్ట్ నీ మైండ్ సెట్ మార్చుకో.. ప్రభుత్వం చేసేది చేస్తుంది.