కరోనా నియంత్రణకు కొత్త ప్లాన్.

  • కరోనా నియంత్రణకు కొత్త ప్లాన్.
  • వైరస్ నిర్దారణ, ట్రీట్మెంట్ కు ప్రైవేట్ కు అప్పగించారు.
  • ఇకపై అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా టెస్టులు.
  • ఏపీలో 2వేల 900 మన దగ్గర 2,200 మాత్రమే.
  • ట్రీట్మెంట్ కు కూడా చాలా తక్కువ రేట్లు నిర్ణయం.
కరోనా కట్టడికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. చుట్టుపక్కల ఉన్న మొత్తం 30 నియోజకవర్గాల్లో 50వేల టెస్టులు చేయించాలని నిర్ణయించింది ప్రభుత్వం. కరోనా నియంత్రణపై ఫోకస్ పెట్టిన సీఎం.. ప్రైవేట్ గా టెస్టులు, ట్రీట్మెంట్ కు అనుమతి ఇచ్చారు. అధికారులను ధరలు నిర్ణయించాలని ఆదేశించడంతో.. 12గంటల్లోనే రేట్లు ఫిక్స్ చేశారు. ప్రైవేట్ లో కరోనా టెస్టుకు 2వేల 200గా నిర్ణయించారు. ప్రైవేట్ ఐసోలేషన్ లో ఉంటే.. రోజుకు 4వేలు, విత్ వెంటిలేటర్.. రోజుకు 9వేలు, విత్ ఔట్ వెంటిలేటర్ ఐసీయూ ట్రీట్మెంట్ కు 7వేల 500గా నిర్ణయించారు. ప్రైవేట్ టెస్టులు, రిపోర్ట్ లు అన్నీ.. కరోనా పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. లక్షణాలు లేకుంటే.. ఎవ్వరికీ టెస్టులు చేయొద్దన్నారు.
కరోనా కట్టడికి ప్రభుత్వ హాస్పిటళ్ల మీద భారం పెరగడం.. వైద్యులకు రెస్ట్ లేకుండా పోవడం.. డాక్టర్ల మీద దాడులు జరగడం చూసిన ప్రభుత్వం.. ఒక్క దెబ్బతో.. అన్నీ పోగొట్టింది. ప్రైవేట్ ల్యాబ్స్, హాస్పిటల్స్ కు కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ కు అనుమతి ఇచ్చింది. దీనివల్ల.. ఎక్కువమందికి వైద్యం అందే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణలో కరోనా కట్టడికి సాధ్యం అవుతుంది. డబ్బులున్న వాళ్లు ప్రైవేట్ టెస్టులకు వెళ్తారు. మరొకరికి వైరస్ అంటక ముందే జాగ్రత్త పడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని.. యావత్ తెలంగాణ పొగుడుతోంది. సీఎంగా కేసీఆర్ ఏం చేసినా సంచలనమే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 10వేలకు పైనే ప్రైవేట్ ట్రీట్మెంట్ అందుతోంది. కానీ.. మన దగ్గర 10వేల లోపే నిర్ణయించి.. ప్రజలకు మేలు చేశారు.
ఇన్నాళ్లు.. సరైన ట్రీట్మెంట్ అందించడం లేదు. టెస్టులు చేయడం లేదన్న దానికి సరైన సమాధానం చెప్పారు. ఒక్క నిర్ణయంతో.. రాష్ట్రంలో ప్రజలంతా సేఫ్ జోన్ వెళ్లే అవకాశం ఉంది. ప్రైవేటుగా టెస్టులు చేయించుకుంటే..ప్రజలకు ఉన్న అనుమానాలు కూడా పోతాయి. సో వైరస్ సోకిన వారు మరింత మందికి అంటించే ఛాన్స్ కూడా ఉండదు. అందుకే కాస్త ఆలస్యం అయినా.. ప్రైవేట్ టెస్టులకు పర్మీషన్ ఇచ్చి మంచి పని చేశారు. అండ్ మోర్ ఓవర్.. పేద, మధ్య తరగతికి అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించి.. ప్రజల సీఎం అనిపించారు కేసీఆర్. ఇకపై రాష్ట్రంలో కరోనాకు ట్రీట్మెంట్ అందకుండా ఎవ్వరూ చనిపోయే ప్రమాదం ఉండదు.