తెలంగాణలో ప్రైవేట్ లో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్.

 

  • తెలంగాణలో ప్రైవేట్ లో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్.
  • కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో..
  • ప్రభుత్వం పునరాలోచన చేసింది. ప్రైవేట్ గానూ…
  • కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ కు అనుమతి ఇచ్చింది.
  • తద్వారా.. రాష్ట్రం మొత్తాన్ని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లారు.

 

వర్షాకాలం ప్రారంభం కావడం.. రోజుకు.. 200కు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో.. ప్రభుత్వ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితి ఉండటంతో.. ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్ కు పర్మీషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాస్త ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ గా టెస్టులు, ట్రీట్మెంట్ కు పర్మీషన్ ఇవ్వడం ద్వారా.. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. డబ్బులున్న పేద, మధ్య తరగతి వాళ్లు సైతం ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ధరలు నిర్ణయించి.. ప్రజా ప్రభుత్వం అనిపించుకుంది తెలంగాణ సర్కార్.

కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ గా టెస్టులకు పర్మీషన్ ఇచ్చినా.. ప్రభుత్వ పర్యవేక్షణ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని నిబంధనలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారీతిన ప్రజలను దోచుకునే ఛాన్స్ ఉండదు. అలా ఉంటే.. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ లైసెన్సులు కూడా రద్దు చేసే కఠిన నిర్ణయం ఉంటుందని హెచ్చరించడంతో.. ప్రైవేట్ వాళ్లు కూడా భయపడే అవకాశం ఉంది. అవసరం మేరకే ట్రీట్మెంట్ అందించి ప్రజలను రక్షించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఆలోచించి ప్రైవేట్ నిర్ణయం తీసుకోవడంతో.. అతి త్వరలోనే కరోనా నుంచి తెలంగాణ భయటపడే అవకాశం ఉంది.

ప్రజల్ని రక్షించడం కోసం ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధమే అని ఇంతకుముందు చెప్పినట్లుగానే.. ఒక్కో స్టెప్ తీసుకుంటూ వెళ్తోంది. ప్రజలకు అతి తక్కువ ధరకే ట్రీట్మెంట్ అందించేలా చర్యలు తీసుకుంటోంది. జనం మీద భారం పడకుండా.. మంచి వైద్యం అందించే ఆలోచన చేయడం నిజంగా మన అదృష్టం. ఒక ఇటలీ, ఒక అమెరికాలా మారకముందే.. ప్రభుత్వం చర్యలు చేపట్టడం.. ప్రైవేట్ హాస్పిటళ్లను నియంత్రించడం సూపర్. దేశంలో అతి తక్కువకే మన దగ్గరే చికిత్స అందిస్తుండటం గర్వించదగ్గ విషయమని నిపుణులు అంటున్నారు.